వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారుప్రభుత్వ విప్ కు పూర్ణకుంభం,భాజ భజంత్రీలతో ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదపండితులు ఆశీర్వచన మండపంలో ప్రభుత్వ విప్ కు వేదో ఆశీర్వాదం అందజేశారు.. ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు